Warangal MGM Power Cuts | విద్యుత్ అంతరాయంతో వరంగల్ MGM లో రోగుల అవస్థలు
చూస్తున్నారు గా చేతిలో సైలెన్ బాటిల్ పట్టుకుని కూర్చుంది ఈ మహిళ. ఆసుపత్రిలో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన ఈమె ఐదు గంటల పాటు కరెంటే రాకపోవటంతో ఊపిరి ఆడక ఇలా వరండాలో కూర్చున్న పరిస్థితి. ఇది వరంగల్ MGM ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.
చూస్తున్నారు గా చేతిలో సైలెన్ బాటిల్ పట్టుకుని కూర్చుంది ఈ మహిళ. ఆసుపత్రిలో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన ఈమె ఐదు గంటల పాటు కరెంటే రాకపోవటంతో ఊపిరి ఆడక ఇలా వరండాలో కూర్చున్న పరిస్థితి. ఇది వరంగల్ MGM ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది..
కేవలం తెలంగాణ నుంచి కాకుండా ఛత్తీస్ గఢ్ నుంచి రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో కరెంటు అంతరాయాలు రోగులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వెంటిలేషన్ మీద ఉండే రోగులు, ఇంక్యూబేషన్ లో ఉండే నవజాత శిశువులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. నిన్న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో పోయిన కరెంటు రాత్రి 09.30 రాకపోవటంతో రోగులు ఇలా సైలెన్ బాటిల్స్ పట్టుకుని వరండాలో కూర్చుని కనబడ్డారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం కరెంటు సమస్య ఆసుపత్రికి లేదని కొట్టిపారేస్తున్నాయి. ఎంజీ ఏం కు ప్రధాన లైన్ నుండి వచ్చే వీసివీ బ్రేక్ కావడంతో కొంత కరెంట్ కు అంతరాయం కలిగిందని వెంటనే జనరేటర్స్ తో కరెంట్ సరఫరా కావడం జరిగిందని ఆస్పత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆస్పత్రి లో మూడు 250 kv, 125kv, 62 kv జనరెటర్స్ ఉన్నాయి. కరెంట్ పోయినా వెంటనే జనరేటర్స్ అన్ అవుతాయి. అయితే ఈ మూడింటికి గంటకు 15 వేల రూపాయలు డీజిల్ అవసరమని, డీజిల్ కొరతతో కొన్ని సందర్భాల్లో కరెంట్ సమస్య తలెత్తుతుందని ఇంచార్జీ సూపరింటెండెంట్ చెప్పారు. ఇటీవల కరెంటు కష్టాలు మరింత ఎక్కువ అవటంతో ఆసుపత్రికి రోగులు భయపడిపోతున్నారు.