KTR on CM Revanth Reddy | ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావ్ రేవంత్..? | ABP Desam
ఎమ్మెల్సీ గ్రాడ్యూయేట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు సంధించారు. ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసేశానని రేవంత్ చెబుతున్నారని..మీకేమైనా అందుతున్నాయా అంటూ గ్రాడ్యుయేట్లను ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరి పంటకు రూ.500 బోనస్ ప్రకటించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు వరి పంట మొత్తానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు కేవలం సన్నాలకే దాన్ని పరిమితం చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నయవంచనకు గురి చేసిందని.. వారికి కౌంట్ డౌన్ రైతుల నుంచే మొదలవుతుందని అన్నారు.
ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు.. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు.. నేటి నుంచి రైతన్నల చేతిలోనే. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. ’’ అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.