Corruption in Kakatiya University | ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వీసీ రమేష్ కుమార్ అక్రమాలు..
Corruption in Kakatiya University |
తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీని కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ తాటికొండ రమేష్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం విజిలెన్స్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వీసీ రమేష్ కుమార్ పైన మాత్రమే కాదు... రిజిస్ట్రార్ సహా ఇతర అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు వీసీ తీరుపై తరచూ ఆందోళనలు చేస్తున్నారు.
తాటికొండ రమేష్ కుమార్ వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలు మొదలయ్యాయని, పాలన గాడి తప్పిందని యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాల్లో అవినీతి, అక్రమ బదిలీలు, నకిలీ ప్రాజెక్టుల పేరు చెప్పి డబ్బు దండుకున్నారని, పీహెచ్ డీ కేటగిరీ-2 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, యూనివర్సిటీ భూముల కబ్జాలో కూడా ఆయన పాత్ర ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పీహెచ్ డీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేసిన తర్వాత... నిబంధనలకు వ్యతిరేకంగా వీసీ తీసుకున్న చర్యలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది.