Yadadri Bhongir Lorry Fire Visuals | పెట్రోల్ బంకులో పేలిన లారీ..కానీ అతనేం చేశాడంటే.? | ABP Desam

ఓ లారీ డీజిల్ కొట్టించుకోవటానికి బంకుకు వచ్చింది. అయితే డీజిల్ ట్యాంక్ లో ప్రెజర్ పెరిగిపోయిందేమో ఒక్కసారిగా ఇదిగో ఇలా పేలిపోయింది. అంతే అందరూ పరుగులు. ఎందుకంటే వాళ్లంతా ఉన్నది పెట్రోల్ బంకులో. మంటలు వ్యాపించాయంటే క్షణాల్లో అంతా బూడిదైపోతారు. కానీ పెట్రోల్ బంకులో పనిచేసే ఈ ఉద్యోగి ధైర్యం చూడండి. అసలు భయమే తెలియని దేవరలా మంటల మీదకు దూసుకువచ్చాడు. బంకులో ఉన్న డీసీపీ, ఫోమ్ లాంటి ఫైర్ ఫైటింగ్ సిలిండర్లతో మంటపై యుద్ధమే చేశాడు. మిగిలిన వాళ్లు కనీసం సహకారానికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ కారు వ్యక్తి చూడండి మెల్లగా కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఈవిడ తలుపు వేసుకుని లోపల దాక్కున్నారు. ఎవరి ప్రాణ భయం వాళ్లది. కానీ ఇతను మాత్రం అస్సలు అలా అనుకోలేదు. ముందు మంటల వ్యాప్తి బంకు వైపు రాకుండా చేశారు. ఫైర్ ఫైటింగ్ టెక్నిక్ ఇది. గాలి వీచే దిశగానే నిలబడి గ్యాప్ లేకుండా ఫైర్ ఫైటింగ్ చేయాలి. అలా అతను పడిన కష్టం ఫలించి మంటలు అదుపులోకి వచ్చాయి. ఈలోగా మిగిలిన పెట్రోల్ బంకు సిబ్బంది కూడా సహకరించారు. అంతా కలిసి మంటలను ఆర్పినా ముందు నుంచి ధైర్యంగా మంటలు ఆర్పిన ఈ ఉద్యోగిని అందరూ ప్రశంసించారు. భువనగిరి సమీపంలోని నయారా పెట్రోల్ బంకులో జరిగింది ఈ ఘటన. సీసీటీవీ కెమెరాలో ఈ విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola