Cheetah హెలికాప్టర్ ప్రమాదంలో Telangana కు చెందిన Lieutenant Colonel Vinay Bhanu Reddy మృతి | ABP Desam
గురువారం అరుణాచల్ ప్రదేశ్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ వి.వినయ్ భాను రెడ్డి మరణించారు. శుక్రవారం ఆయన భౌతికకాయాం బేగంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరుకుంది. సైనిక గౌరవాలతో నివాళులర్పించారు.
అనంతరం లెఫ్టినెంట్ కల్నల్ భౌతికకాయాన్ని రోడ్డు మార్గంలో ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంకు తరలించారు. అయిన మృత దేహానికి తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆర్మీ అధికారులు నివాళు అర్పించారు.
శనివారం యాదాద్రిలో అంత్యక్రియలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ నవ్ కుమార్ ఖండూరి, GOC, వెస్ట్రన్ కమాండ్, అంత్యక్రియలకు హాజరు అయ్యారు.
లెఫ్టినెంట్ కల్నల్ రెడ్డి భార్య స్పందన పూణేలోని AFMCలో డాక్టర్. తన భర్త మృతదేహాన్ని స్వీకరించేందుకు తేజ్‌పూర్‌కు వెళ్ళి స్వస్థాలానికి తీసుకు వచ్చారు.
లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి 17 సంవత్సరాల వయస్సులో NDA లో చేరారు. 2007 లో భారత సైన్యంలో చేరారు.
అస్సాంలోని సోనిత్‌పూర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ మధ్య ఆపరేషనల్ సోర్టీలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలోని మండాలా సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్ రెడ్డి తో పాటు మేజర్ జయంత్ single engine చీతా హెలికాప్టర్‌లో ఉన్నారు.
మేజర్ జయంత్ భౌతికకాయం శుక్రవారం రాత్రి మధురైలోని స్వగ్రామానికి చేరుకుంది.