Vikarabad Resorts Adventure Game: అడ్వెంచర్ గేమ్ లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్న సాయి
వికారాబాద్ జిల్లా గోధుమగూడలోని ఓ రిసార్ట్ లో అడ్వెంచర్ గేమ్ ఆడుతూ ఒక వ్యక్తి మరణించాడు. ఓ వస్తువును వెతకడాన్నే గేమ్ గా రిసార్ట్ నిర్వాహకులు పెట్టారు. హైదరాబాద్ కు చెందిన చాలా మంది యువకులు... వీకెండ్ కోసమని ఈ రిసార్ట్ కు వచ్చి ఈ గేమ్ లో పాల్గొన్నారు. గేమ్ లో భాగంగా... సాయి కుమార్ అనే 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బావిలోకి దూకి మరణించారు. చాలా సేపు గాలించిన తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది అతని మృతదేహాన్ని బయటకు తీశారు.