Vikarabad: టీఆర్ ఎస్ నేతల ప్రొటోకాల్ రచ్చ..!
వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి హాజరయ్యారు.సభ ప్రారంభం అయ్యే ముందే ఎమ్మెల్యే వర్గీయులు ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ,ఎమ్మెల్సీ వర్గీయలు నిలదీసారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైయ్యింది. మంత్రి వారించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.