Unknown Person Kidnap Woman In Sircilla : యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రితో కలిసి ఆ యువతి.... ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందుగానే కారులో కాపు కాసిన నలుగురు యువకులు... తండ్రిని కొట్టి ఆయనను పక్కకు తోసేసి యువతిని బలవంతంగా కారు ఎక్కించారు. యువతి మైనర్ గా ఉన్న సమయంలో ప్రేమ పేరుతో వేధించి జైలుకి వెళ్లి తిరిగొచ్చిన యువకుడి పనే ఇదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.