Two Sisters Stopped Cow Slaughtering | గోవధను ధైర్యంగా అడ్డుకున్న అక్కచెల్లెళ్లు | ABP Desam

Continues below advertisement

బక్రీద్ కోసం వధించడానికి తీసుకువెళ్తున్న గోవులను ఇద్దరు అక్కచెల్లెళ్లు ధైర్యంగా అడ్డుకున్నారు. వారు గోఆధారిత వ్యవసాయం చేసే రైతులని తెలిపారు. ఈ అంశంపై వారు ఏమన్నారో వీడియోలో చూడండి. గోవుల రవాణా విషయంలో వివాదం తలెత్తిన మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ లో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. ఈ ఘటనపై ఆదివారం బండి సంజయ్ మాట్లాడుతూ.. అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడాలని, దాంతోపాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించవద్దని, అమాయకులను ఇబ్బందులకు గురిచేయకూడదని చెప్పారు. పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే మెదక్ ఘటనలో పరిస్థితులు అదుపులోకి వస్తాయన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరికీ కొమ్ము కాయకూడదని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram