Medak Clashes | గోవుల తరలింపుతో మెదక్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు | ABP Desam

మెదక్ పట్టణంలో జూన్ 15న రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆవులను రవాణా చేస్తుంటే భారతీయ జనతా యువమోర్చా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలిపారు. దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలలో పలువురికి గాయలు కాగా, అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద ఆవులు కనిపించడంతో బక్రీద్ సందర్భంగా గోవధ చేసేందుకు తరలిస్తున్నారని వాదన మొదలైంది.

మరోచోట సైతం ఆవులు ఉన్నాయన్న సమాచారం మేరకు సీఐతో కలిసి అక్కడికి వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడిచేయడం కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం ఇది ఇరు వర్గాల దాడికి దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, దాడులు చేసుకుంటున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. 

గోవుల రవాణా విషయంలో వివాదం తలెత్తిన మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ లో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. ఈ ఘటనపై ఆదివారం బండి సంజయ్ మాట్లాడుతూ.. అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడాలని, దాంతోపాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola