TRS Leaders Statewide Protest: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పోరుబాట పట్టిన టీఆర్ఎస్ నాయకులు | ABP Desam
Telangana లో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందేనంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో TRS నాయకులు, మంత్రులు, MLA లు నిరసన చేపట్టారు. ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ గ్రామంలో నిరసనకు దిగిన Minister Puvvada Ajay Kumar.... ధాన్యం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు. కరీంనగర్ గ్రామీణం మండలం గోపాల్ పూర్ క్రాస్ రోడ్స్ లో జరిగిన నిరసన దీక్షలో మరో మంత్రి Gangula Kamalakar రైతులతో కలిసి పాల్గొన్నారు. Central Minister Piyush Goyal అబద్ధాలు ఆడుతున్నారని... వరి కొనకపోతే కేంద్రానికి నూకలు చెల్లుతాయని జోస్యం చెప్పారు. Jangaon జిల్లా పాలకుర్తిలో ఆందోళన చేపట్టిన మరో మంత్రి Errabelli Dayakar Rao... ఎడ్లబండిపై వెల్లి నిరసన తెలిపారు. తెలంగాణ రైతులంతా పోరాటం చేస్తే కేంద్రం దిగి వస్తుందని పిలుపునిచ్చారు.