Transgender Women Bags Making | ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తయారీలో నైపుణ్యం చాటుతున్న ట్రాన్స్ మహిళలు

Continues below advertisement

  ఆత్మగౌరవంతో బతకటం..స్వశక్తితో తమ కాళ్ల పై తాము నిలబడటం ఇదే ఈ ట్రాన్స్ జెండర్స్ నినాదం. ట్రాన్స్ మహిళలుగా మారిన వీరంతా సమాజంలో తమకంటూ ఓ గౌరవం సంపాదించుకునేలా జ్యూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ పొందారు.  హైదరాబాద్ లోని సూరారం లో కొందరు ట్రాన్స్‌జెండర్ మహిళలు ఇలా తమ జీవనోపాధి కోసం ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ ను తయారు చేస్తూ స్వయం ఉపాధి బాట పట్టారు.జ్యూట్ మెటీరియల్ తో లంచ్ బాస్కెట్లు, ఆఫీసు బ్యాగులు, పిల్లల స్కూలు బ్యాగుల, మహిళల హ్యాండ్ బ్యాగులను కస్టమర్లకు నచ్చే డిజైన్లలో తయారు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ ట్రాన్స్ మహిళలు. గతం లో  భిక్షాటన, వ్యభిచారం అంటూ రకరకాల మార్గాల్లో జీవితాన్ని వెతుక్కోవాల్సి వచ్చేదని ఇప్పుడు ఈ బ్యాగుల తయారీ ద్వారా తమ కష్టార్జితాన్ని సంపాదించుకోగలగుతున్నామని సంతోషంగా చెబుతున్నారు వీరంతా. తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ అయిన TSWDC అందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వీరు ఈ అవకాశాన్ని పొందారు.45 రోజుల నైపుణ్య శిక్షణ తర్వాత, వీరు ప్రస్తుతం తమ ఇంటి నుంచే జ్యూట్ బాస్కెట్లు, బ్యాగులను తయారుచేస్తున్నారు. దుర్గాబాయ్ మహిళా శిషు వికాస్ కేంద్రం సహకారం తో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ను విజయవంతం గా నిర్వహించారు.  ఈ స్కిల్ ఎంహేన్స్మెంట్ ప్రోగ్రాం ను 'స్వాభిమాన స్పూర్తి' పేరుతో విజయవంతం గా ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ వర్కర్ ముకుందమాలా , ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ ప్రెసిడెంట్ మీరా జాస్మిన్, హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ రచనా ముద్రబోయినా ముఖ్య పాత్ర  పోషిస్తున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram