Smita Sabharwal Tweet On Disabled Person Reservation |దివ్యాంగుల రిజర్వేషన్లపై వివాదాస్పద ట్వీట్ |

Smita Sabharwal Tweet On Disabled Person Reservation |   ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై IAS స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం లేపుతున్నాయి. దీనిపై న్యాయవాదులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దివ్యాంగుల సంఘాలు మండిపడుతున్నాయి. అసలేం జరిగిందంటే..! పుణేలో ఫేక్ సర్టిఫికెట్ తో దివ్యాంగురాలి కోటాలో పూజా ఖేడ్కర్ IAS సాధించందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్తపై స్పందించిన స్మిత సభర్వాల్... దివ్యాంగులపై గౌరవిస్తూనే... దివ్యాంగులను పైలట్ గా నియమిస్తారా..? దివ్యాంగుడైన సర్జన్ ను మీరు బలంగా విశ్వసిస్తారా..?  మరి అలాంటిది ఆలిండియా సర్వీసుల్లోని వారు క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఎక్కువ సేపు జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఫిజికల్ ఫిట్ నెస్ ఇంపార్టెంట్.  అలాంటప్పుడు... ఈ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకు అని ఆమె రాసుకోచ్చారు. కోసమెరుపుగా.. జస్ట్ asking అని రాసుకొచ్చారు. ఇప్పుడు ట్వీట్ పై పెద్ద రచ్చే నడుస్తోంది సోషల్ మీడియాలో. CSB IAS అకాడమి నడుపుతున్న బాల లత మేడమ్ కూడా సీరియస్ అయ్యారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola