Paddy : తెలంగాణా రైతుల ధాన్యం కష్టాలు తీరే దారేది..?
తెలంగాణాలో వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సాగుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం కల్లాల్లో ఉన్న ధాన్యం సంగతి మరిపోయిందంటున్నారు.ప్రకటనల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాల లెక్కలు కనిపిస్తున్నాయని, క్షేత్ర స్దాయిలోపరిస్దితులు దారుణంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ప్రకటనలు చేసిన పాలకులు , ఆ తరువాత ధాన్యం కొనుగోలు విషయంలో చేతులెత్తేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు రవాణా సమస్య సైతం ధాన్యం రైతుల్లో గబులు పుట్టిస్తోంది...