MPDO OFFICE LOCK: రాజన్న సిరిసిల్ల మండలం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన

Continues below advertisement

రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది ఓ బాధిత కుటుంబం. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా కుటుంబ సభ్యులతో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం పద్మానగర్ కు చెందిన సంతోష్ కుటుంబం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో కొందరు తెరాస నేతలు స్థలాన్ని తనకు అమ్మారని ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తుండగా అదే తెరాస నేతలు అధికారులకు పిర్యాదు చేసి ఇంటికి పర్మిషన్ లేదంటూ జేసీబీ తో కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రజాప్రతినిధుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయలతో పాటు నివేశ స్థలాన్ని కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోవటం లేదని మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram