Kodandaram: కేసీఆర్ హిట్లర్‌ను మించిన నియంత.. జేఏసీని లేకుండా చేయాలనుకున్నారన్న కోదండరామ్
కేసీఆర్ నైజాన్ని తాను.. ఆయనతో కలిసిఉన్నప్పుడే గుర్తించానని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుక ఉండకూడదు అని కేసీఆర్ భావించారని అందుకే తనను ..జేఏసీని లేకుండా చేయాలనుకున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అంటుండేవారని.. ఆయన కనుక ఇప్పుడు ఉండుంటే కచ్చితంగా ప్రశ్నించేవారన్నారు.