Chatrinaka Police : ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి అమానుషం
హైదరాబాద్ , పాతబస్తీ లో దారుణం జరిగింది. అల్లరి చేసాడని కన్న కొడుకుని అతి కిరాతకంగా కర్రతో కొట్టిన ఘటన వెలుగుచూసింది. తప్పు అయ్యింది పప్పా క్షమించు అని కాళ్లావేళ్లా పడి కన్నకొడుకు వేడుకున్నా తండ్రి వినలేదు. కొడుకు పై జరిగిన దాడి తెలుసుకున్న తల్లి జిజా బాయి ఛత్రినాక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.