Telangana IT Raids : తెలంగాణలో దర్యాప్తు సంస్థల దూకుడు..దేనికి సంకేతం | ABP Desam
యాభై మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. 40 గంటలపాటు.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సాగించిన సోదాలు.. చూస్తే..రాష్టంలో రాజకీయం రసకందాయంలో ఉందని అర్థం కాకమానదు. అదేంటి ఐటీకి రాజకీయానికి సంబంధం ఏంటా అనే డౌట్ వచ్చిందా... అయితే మీరు తెలంగాణ పాలిటిక్స్ ను సరిగ్గా ఫాలో అవ్వడం లేదని అర్థం.