HMDA పరిధిలోని అక్రమకట్టడాలకు చెక్ పడేనా? | ABP Desam
తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం నజర్ పెట్టింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల కమిషనర్లకు పురపాలకశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లే అవుట్లు వెలుస్తున్నట్టు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.