Telangana Field Officers : తెలంగాణాలో వివాదంగా మారిన ఉపాధిహామీ ఫీల్డ్ ఆఫీసర్ల తొలగింపు..!|
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్లను విధుల నుండి తొలగించడంతో ఆవేదనకు గురై ఓ ఫీల్డ్ ఆఫీసర్ అనారోగ్య బారిన పడి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో చోటుచేసుకుంది. అతని మృతికి ప్రభుత్వమే కారణమంటూ తోటి ఫీల్డ్ ఆఫీసర్లు రంగంపేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన ఫీల్డ్ ఆఫీసర్లకు సిరిసిల్ల బిజెపి నాయకులు మద్దతు తెలిపారు.