Telangana Council Chairman రేసులో ఆ ఇద్దరు
శాసనమండలి చైర్మన్ గా ఎవరు కాబోతున్నారు. ప్రస్తుతం చైర్మన్ స్థానంలో ఉన్న భూపాల్ రెడ్డి పదవీ కాలం జనవరి 4తో ముగియనుంది. సో కొత్త చైర్మన్ ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. దీనికోసం రెండు రోజులు మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో శాసనమండలిలో వివిధ కోటల లో ఉన్నటువంటి స్థానాల్లో అన్ని కూడా పూర్తి అయిపోయాయి. టిఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. 40 మంది ఉన్న మండలిలో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలుపుకొని టిఆర్ఎస్ బలం 36. తాజాగా గవర్నర్ కోటాలో ఒకరు ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు లోకల్ బాడీ కోటాలో 12మంది కలుపుకుని మొత్తం 19 మంది ఇటీవల టిఆర్ఎస్ తరఫున ఎన్నికయ్యారు. ఇక మండల్ లో ఉన్న ఖాళీ పదవులపై అందరి దృష్టి పడింది. తెలంగాణ శాసనమండలిలో చైర్మన్ పదవి కాదు డిప్యూటీ చైర్మన్ దీంతో పాటు మరో మూడు పదవులు కూడా ఖాళీ అయ్యాయి. వీటిని కూడా భర్తీ చేయాలి. అయితే చైర్మన్ పదవి కోసం గట్టిపోటీ ఏర్పడింది. గతంలో చైర్మన్గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ మండలి చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు గా తెలుస్తోంది. గత సంవత్సరం జూన్ మొదటి వారంలో పదవీ బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల ఆయన పదవి ముగియడంతో తిరిగి మళ్లీ శాసనమండలికి ఎన్నికయ్యారు. చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు, గతంలో శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించిన మధుసూదనా చారి కూడా మనం పదవిని ఆశిస్తున్నట్లు గా తెలుస్తోంది.