Swiggy Zomato Liquor Delivery | ఇకపై లిక్కర్ హోం డెలివరీ... స్విగ్గి, జోమాటో ప్లాన్స్ రెడీ..! | ABP

Swiggy Zomato Liquor Delivery |  ఓ రెండు పెగ్గులు వేసి... స్విగ్గి లేదా జోమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే మస్త్ ఉంటుంది కదా అనుకునే వాళ్లు మన సర్కిల్ లోనే చాలా మంది ఉంటారు కదా..! అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. అదేటంటే... స్విగ్గీ, జోమాటో వంటి యాప్ ల్లో ఫుడ్ మాత్రమే కాదు...లిక్కర్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక.. లిక్కర్ ను కూడా వారు డోర్ డెలివరీ చేస్తారట. దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. లిక్కర్ డోర్ డెలివరీ అంటే మద్యం తాగామని ఎంకరేజ్ చేయడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. కానీ, ట్రెండ్ మారింది. స్విగ్గీ,జోమాటో వంటివి విరివిగా అందుబాటులో ఉన్న మెట్రో నగరాల్లో లిక్కర్ తాగుడు కామన్ గా మారింది. ఈ తరుణంలో.. మద్యం తాగాలని ఉన్నా.. బయటకు వెళ్లి తీసుకొనే ఓపిక లేని వాళ్లు, మొహమాటపడి షాపులకు వెళ్లలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola