Children's Library in Narsampet | పేద పిల్లల కోసం లైబ్రరీ...గవర్నమెంట్ టీచర్ గొప్పతనం | ABP Desam

Continues below advertisement

Children's Library in Narsampet |

ఇక్కడ కనిపిస్తుంది ఓ లైబ్రరీ..! ఈ లైబ్రరీ పిల్లల కోసం..!  చిన్నతనంలో పుస్తకాల కోసం తాను అనుభవించిన కష్టాలు పేద పిల్లలు అనుభవించ కూడదనే లక్ష్యంతో లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని ప్రారంభించాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.  వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రవికుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2007 సంవత్సరంలో లీడ్ ఫౌండేషన్ ను ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా మొదటగా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చారు. ఆ తరువాత 2020 సంవత్సరంలో చిల్డ్రన్స్ లైబ్రరీని ప్రారంభించారు. నర్సంపేట లోని తన ఇంటిలోని సగభాగాన్ని లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీగా మార్చాడు. ఈ చిల్డ్రన్స్ లైబ్రరీలో సుమారు 25 వేల పుస్తకాలు ఉండగా పిల్లల కోసం 4వేల నుంచి 5వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కథలు, కవిత్వాలు, ఆధ్యాత్మిక, బొమ్మలతో కూడిన కథల పుస్తకాలు, ప్రముఖుల పుస్తకాలు వీటితోపాటు విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram