Somasila:వరద నీటితో పోటెత్తుతున్న సోమశిల జలాశయం
సోమశిల జలాశయం వరద నీటితో పొంగిపొర్లిపోతోంది. ఇప్పటికే జలాశయంలో దాదాపుగా 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీనికి తోడు భారీగా వర్షాలు కురవడం కారణంగా జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నాయి. దీంతో జలాశయంలో రెండు గేట్లు ఎత్తిన అధికారులు వరద నీటిని క్రిందకి వదులుతున్నారు.