
SLBC Tunnel Incident Rescue | ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో మొదలైన రెస్క్యూ ఆపరేషన్ | ABP డిసం
నాగర్ కర్నూల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు కేంద్ర నుంచి వచ్చిన విపత్తు దళాలు రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించాయి. తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్ర నుంచి ndrf బలగాలు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్ slbc టన్నెల్ కు చేరుకున్నాయి. విపత్తు నిర్వహణ దళాలతో పాటు టన్నెల్ నిర్వాహకులు ఇన్నర్ ట్రాక్ ద్వారా టన్నెల్లోకి ప్రవేశించారు. 14 కిలోమీటర్ల లోపల.. ఈ ప్రమాదం జరగడంతో.. అక్కడ చిక్కుకున్న ఎనిమిది మందిని బయటికి తీసుకొచ్చేందుకు,. ప్రణాళికలు రచించనున్నారు. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉండడంతో.. వారికి సమాచారాన్ని చేరవేసేందుకు.. ఏమైనా మార్గాలు ఉన్నాయన్న కోణాల్లో పరిశీలించమన్నారు. లోపల చిక్కుకుపోయిన వారికి.. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదని ఇప్పటికే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటించారు. అచ్చం ఇలాంటి ఘటనే కొద్ది నెలల క్రితం. ఉత్తరాఖండ్లో జరగగా... వాళ్లకి ప్రత్యేక పైప్లైన్ ద్వారా ఆహారాన్ని పంపించారు. ఇక్కడ అలాంటి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో పాల్గొన్న నిపుణులనే పిలిపిస్తున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ... ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని... రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో టచ్ లో ఉండాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.