
SLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
నాగర్ కర్నూలు పరిధిలో శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ జరిగిన ప్రమాదంలో 8మంది సొరంగం లోపల చిక్కుకుపోయారు. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల పైకప్పు ఊడి పడిపోవటంతో ప్రమాదం జరిగింది. బోరింగ్ మిషన్ ఆన్ చేయగానే నీరు లీకై మట్టి కుంది పెద్ద శబ్దంతో టన్నెల్ కుంగిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ 50మంది కార్మికులు ఉండగా వారిలో 42మంది కార్మికులు బయటకు తీసుకువచ్చారు. కానీ 8మంది మాత్రం టన్నెల్ లో చిక్కుకుపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చిక్కుకున్న వారిలో ఓ ప్రాజెక్ట్ ఇంజినీరు, ఫీల్డ్ ఇంజినీరు, నలుగురు కార్మికులు, ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో SLBC కి వెళ్లిన మంత్రులు అక్కడ సహాయకచర్యలను అడిగి తెలుసుకున్నారు.