
SLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABP
శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది చిక్కుకుపోయారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. వారిని బయటకు తీసేందుకు వీలు లేకుండా పరిస్థితులు ఉన్నాయని...ఇందుకోసం తమకు ఆర్మీ సహాయం కావాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే NDRF బలగాలు తెలంగాణకు బయల్దేరాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పగా...సొరంగంలో చిక్కుకున్న వారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నిపుణులు, కార్మికులు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలను అందించారు. నాగర్ కర్నూలు పరిధిలో శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ జరిగిన ప్రమాదంలో 8మంది సొరంగం లోపల చిక్కుకుపోయారు. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల పైకప్పు ఊడి పడిపోవటంతో ప్రమాదం జరిగింది. బోరింగ్ మిషన్ ఆన్ చేయగానే నీరు లీకై మట్టి కుంది పెద్ద శబ్దంతో టన్నెల్ కుంగిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ 50మంది కార్మికులు ఉండగా వారిలో 42మంది కార్మికులు బయటకు తీసుకువచ్చారు.