Sand Mafia : ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేలా సిరిసిల్ల విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ
Continues below advertisement
ఇసుక మాఫియాను అరికట్టేందుకు ఓ పరికరాన్ని తయారు చేసింది పదో తరగతి విద్యార్థిని. సిరిసిల్ల జెడ్పీహెచ్ స్కూల్ లో పదో తరగతి చదువుకుంటున్న అనీలా తన టీచరైన శంకర్ గౌడ్ తో కలిసి...ఆర్ఎస్ సెన్సార్ ఆర్ ఎఫ్ రిసీవర్, ఆర్ ఎఫ్ ట్రాన్స్ మీటర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటింగ్ టెక్నాలజీతో ఓ పరికరాన్ని సిద్ధం చేసింది. ఫలితంగా ఎవరైనా ఇసుక రవాణా అక్రమంగా చేసినట్టు ఉంటే స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో దాని సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతోందీ ఈ యువ ఆవిష్కర్త.
Continues below advertisement