దీపావళి టపాసుల్లో ఫేక్ కంపెనీలు.. 'ABP దేశం' పరిశీలనలో నిజాలు
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఇదే అవకాశంగా తీసుకుని కాకర్స్ తయారీ కంపెనీలు నిబంధనలు ఏమాత్రం లెక్క చేయకుండా.. హానికరమైన కెమికల్స్ వాడుతూ క్రాకర్స్ తయారు చేస్తున్నాయి. కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా.. అడ్రస్, QR కోడ్ ఇలా ఇవేవీ లేకుండా విక్రయిస్తున్నాయి. అంతేకాదు గ్రీన్ క్రాకర్స్ అంటూ నకిలీ లోగో ముద్రించి అమ్మకాలు సాగిస్తున్న విషయం ABP పరిశీలనలో వెలుగుచూసింది.