కాపురాల్లో చిచ్చు పెడుతున్న కంపెనీలు..
బాలానగర్ లో కంపెనీలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా కంపెనీలు ఏర్పాటు చేశారు. కంపెనీల నుంచి విపరీతమైన శబ్దాలు భరించలేక.. భార్య,భర్తలకు బీపీలు పెరిగిపోతున్నాయి. సహనం కోల్పోయి పిల్లలను విపరీతంగా కొడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శబ్దాలు భరించలేక గుండెపోటు వస్తుందనే భయంతో బతుకుతున్నారు స్థానికులు. నిబంధనలకు విరుద్దంగా శబ్ధకాలుష్యం జరుగుతోందని.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. కంపెనీల తరలింపుపై నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యంగా ఉన్నాయి.