సింగరేణి క్లబ్‌లో సేద తీర్చుతున్న మర్రి చెట్టు
ఈ చెట్టుకు 67 ఏళ్లు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నాటిన మొక్క ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్‌లో 1955లో బాబు రాజేంద్రప్రసాద్ మొక్కను నాటారు. భద్రాచలం గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంబించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన ఈ మొక్కను నాటారు. సింగరేణి సంస్థ అపురూపంగా పెంచడంతో ఇప్పుడు అది వట వృక్షంలా మారింది.