Revanth Reddy Arrested At Ghatkesar: రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam
Continues below advertisement
ఘట్ కేసర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ లో జరుగుతున్న రాకేష్ అంతిమ సంస్కారాలు వెళ్తుండగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేటకు వెళ్తుండగా అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహించిన రేవంత్ రెడ్డి.... వాగ్వాదానికి దిగారు. ఇంకా తన నియోజకవర్గంలో ఉండగానే ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఓ వాహనంలోకి ఎక్కించి తరలిస్తుండగా, ఆ వాహనానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
Continues below advertisement