Raja Singh About Robbery in Medchal | మేడ్చల్ చోరీ ఉదంతంపై మాట్లాడిన రాజా సింగ్ | ABP Desam

మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో జగదాంబ జ్యుయెలర్స్ అనే దుకాణంలో చోరీకి యత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆ దాడిలో గాయపడిన యజమానిని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పరామర్శించారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని మేడ్చల్ కేంద్రంలో పట్టపగలే పెద్ద దొంగతనం జరిగింది. ఇద్దరు దొంగలు క్షణాల్లో ఓ బంగారం షాపులోకి చొరబడి ఉన్నది మొత్తం ఊడ్చుకుపోయారు. మేడ్చల్‌లో ఉన్న జగదాంబ బంగారం షాపునకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఓ పల్సర్ బైకుపై నగల దుకాణానికి వచ్చారు. ఆ బైకును షాపు ముందే పార్క్ చేసి ఉంచి.. ఇద్దరూ లోనికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బుర్ఖా వేసుకోగా.. మరొక దొంగ సాధారణ దుస్తుల్లోనే ఉన్నాడు. షాపులోనికి ప్రవేశించిన కొన్ని క్షణాల వ్యవధిలోనే తొలుత అక్కడున్న సేల్స్ పర్సన్‌ని బుర్ఖా వేసుకున్న వ్యక్తి బెదిరించారు. అతను వెంటనే లోనికి వెళ్లిపోగా.. ఓనర్ ను బెదిరించి వారు తెచ్చుకున్న బ్యాగుల్లో కొన్ని బంగారు వస్తువులను దోచుకొని బయటికి పరుగులు తీశారు. అప్పటికే ఓనర్ పై బుర్ఖా వేసుకున్న వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola