Police Constable CPR Saves Life: Bhupalapally జిల్లాలో ప్రాణం పోసిన కానిస్టేబుల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో.... వంశీ అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి పడిపోయారు. పక్కనే ఉన్న బ్లూ కోల్ట్స్ పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్ కిరణ్ వెంటనే సీపీఆర్ చేశారు. సుమారు 15 నిమిషాల తర్వాత వంశీ తిరిగి శ్వాస తీసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.