Huzurabad Bypoll: వీణవంకలో కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ లో భాగంగా, వీణవంక మండలం గన్ముక్కుల పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుడు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌ రెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు కూడా కౌశిక్ రెడ్డి పోలింగ్ బూత్‌కు రావడాన్ని వ్యతిరేకించారు. ఆయన పోలింగ్ ఏజెంట్ అని, తనకు ఏజెంట్ పాస్ ఉందని కౌశిక్ రెడ్డి చెప్పగా.. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola