ఆ నాలుగిటిని ఒప్పుకోం. సింగరేణి కార్మికుల కోసం ఎక్కడదాకైనా వెళ్తాం
సింగరేణి కార్మికులు చేస్తున్న ఆందోళనకు టీఆరెస్ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నాము. సింగరేణి నుంచి ఏడాదికి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి. సింగరేణి లో డైరెక్ట్ గా 45వేలు, ఇండైరెక్టు గా 25వేల మంది ఉపాధి పొందుతున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ ది. దేశాన్ని కాపాడేది సైనికులు అయితే- దేశానికి వెలుగు ఇచ్చేది సింగరేణి కార్మికులు. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి కారుణ్య నియమాకాలను చేపట్టిన ఘనత కేసీఆర్ ది. రైతు వ్యతిరేక, మతతత్వ పార్టీ బీజేపీ. కోల్ ఇండియాలో ఎక్కడా లేని సౌకర్యాలు తెలంగాణలో ఇస్తున్నాము. సింగరేణి నాలుగు కోల్ బ్లాక్ లను తెలంగాణ కు ఇవ్వాలని 2015లోనే కేసీఆర్ మోడీకి లేఖ రాశారు. కార్పోరేట్ కంపెనీలకు కట్టపెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ- నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అన్ని రంగాలు ప్రైవేటీకరణ చేయడం అయిపోయింది ఇక సింగరేణి పై కేంద్రం కన్ను పడింది.