Khammam Singareni: విధుల బహిష్కరణతో సింగరేణిలో భారీగా నిలిచిన ఉత్పత్తి..!
సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను ప్రవేటీకణ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులలో కార్మికులు విధులను బహిష్కరించారు. సమ్మె వల్ల సింగరేణికి రూ.100 కోట్ల వరకు ఉత్పత్తి నష్టం జరిగింది. కార్మికులు వేతనాలను కోల్పోయారు. సమ్మె వల్ల 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కార్మికులు విధులు బహిష్కరించడంతో గనుల వద్ద యంత్రాలు పూర్తిగా నిలిచిపోయాయి.