Singareni Protest: బొగ్గు బ్లాకుల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వేడెక్కిన నిరసనలు..! | ABP Desam
కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గుబ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ సింగరేణి అన్ని కార్మిక సంఘాలు చేపట్టిన మూడు రోజుల సమ్మె విజయవంతం అయింది. తొలిరోజు అన్ని గనుల వద్ద నిరసన తెలిపిన కార్మిక సంఘాలు, విధులు బహిష్కరించిన కార్మికులు,సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్బంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు వచ్చిన ఉద్యోగులను అడ్డుకున్నారు.