Dalitha Bandhu Scheeme: హాట్ టాపిక్ గా దళిత బంధు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుందా?
తెలంగాణలో దళిత బంధు పథకం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ ను ఎంపిక చేసింది. అయితే ఈ పథకం కేవలం హుజూరాబాద్ వరకేనా? అని ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్కీం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుందా? అనిపిస్తోంది. మా ఎమ్మెల్యే రిజైన్ చేయాలంటూ ఫ్లెక్సీలు పెట్టుకునే స్థాయికి వెళ్లింది. మిగతా నియోజకవర్గాల పరిస్థితేంటని విపక్షాలు గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి.