Sindhu: పర్వాలేదు సింధు మా మనసులు గెలిచావ్ చాలు అంటున్న ఫ్యాన్స్
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం పోరాడి ఓడిన సింధు... గెలవాలని చాలా మంది ఆకాంక్షించారు. దేశమంతా ఆమె గెలుపు కోరుతూ చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఈవెంట్స్‌ను డిఫరెంట్‌గా చేసే సుధాకర్... సింధు కోసం కూడా స్పెషల్‌గా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.
కంట్రీ క్లబ్ టీంతో కలిసి ఆల్‌ది బెస్ట్ సింధు అంటూ స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి... సింధు మ్యాచ్ చూశారు. “షటిల్ కోక్ కార్" రూపంలో పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫౌండర్ సుధాకర్ రెడీ చేసిన "షటిల్‌కాక్ కార్"ను అంతా కలిసి ఓపెన్ చేశారు. అక్కడే మ్యాచ్ కూడా చూశారు.
దేశంలోని క్రీడాకారులకు మద్దతు ఇవ్వడంలో, ప్రోత్సహించడంలో కంట్రీ క్లబ్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు క్లబ్ సీఎండీ రాజీవ్ రెడ్డి. సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, కపిల్ దేవ్, పీవీ సింధు ఇతర గొప్ప క్రీడాకారులను స్వాగతించిన చరిత్ర తమకు ఉందన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా వారి కోసం ప్రోత్సహిస్తున్నామన్నారు.
సింధు ఓడిపోవడం కాస్త బాధించిందని... కచ్చితంగా బ్రాంజ్ మెడల్ తీసుకొస్తుందన్న ఆశతో మాత్రం వీళ్లంతా ఉన్నారు.