Odisha: మాజీ మావోయిస్టు కృత్రిమ కాలు పెట్టించిన ఒడిశా పోలీసు
ఒడిశా లో మాజీ మావోయిస్టు తులసి హులకకి కృత్రిమ కాలు అమర్చారు. దీంతో ఈమె ఇప్పుడు ఎప్పటిలాగే నడవగలుగుతోంది. పోలీస్ విభాగం, భువనేశ్వరికి చెందిన బ్రదర్ హుడ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కృషి ఫలితంగా తులసి ఇప్పుడు నడవగలుగుతోంది. ఈ సందర్భంగా తులసి నా కాలు బాగు అయ్యేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలని తెలిపింది. కొరాపుట్, మల్కనగిరి జిల్లాల్లో ఈమెపై 18కి పైగా కేసులు, రూ.4 లక్షల రివార్డు ఉన్నాయి. 2018 మార్చిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తులసి తీవ్రంగా గాయపడింది. సరైన వైద్యం అందకపోవడంతో ఈమె కుడి కాలు పాదాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంతో దళంలో ఈమెని కొనసాగించేందుకు మిగతా మావోయిస్టులు నిరాకరించారు. 2020 మార్చి 27న కొరాపుట్ పోలీసులకు లొంగిపోయింది. దీనికి సంతోషించిన పోలీసులు ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తూ వచ్చారు.