అంబులెన్స్ వచ్చింది.. కానీ ఆ ఊరికి వంతెనే లేదు.. వాగు ఇలా దాటించారు


వర్షాకాలంలో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్‌ వచ్చాయి.   ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది.  అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్‌ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్‌ ఎక్కించాడు. చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవళిక చికిత్స పొందుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola