పవర్ స్టార్ ని కలిసిన కిన్నెర కళాకారుడు మెుగులయ్య
కిన్నెర కళాకారుడు దర్శనం మెుగులయ్యకు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మెుగులయ్యను సత్కరించారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాకు రూ.50 వేల చెక్కు ఇచ్చి.. సన్మానించారు. తన ట్రస్ట్.. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.