Rain Robot Roof: రైతుల కష్టాలకు చెలించిన విద్యార్దిని.. ఆవిష్కరించిన అద్బుతం.. | ABP Desam
Continues below advertisement
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అచన్ పల్లిలోని ఇందూర్ మోడల్ స్కూల్ పదో తరగతి చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని రైతుల కష్టాలను దూరం చేసేందుకు రోబో రైన్ రూఫ్ అనే పరికరాన్ని కనుగొంది. ఈ యంత్రం రైతులు పండించిన పంటలను ఆకాల వర్షాల నుండి కాపాడుతుంది. ప్రస్తుతం ధాన్యం ఆరబెట్టిన రైతులను అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. ఈ సమస్యకు తన మేధస్సుతో పరిష్కారం చూపింది విద్యార్దిని శ్రీజ. స్కూల్ లోని టీచర్లు స్వాతి, లావణ్య సహకారం తో రోబో రేయిన్ రూప్ కి రూపకల్పన చేసింది.
Continues below advertisement