Nizamabad Jail: పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న తెలంగాణా ఖిల్లా జైలు..!
Continues below advertisement
తెలంగాణ సాయుధ పోరాటవీరులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రదేశం. కవులు, కళాకారులు, సాహితీ, సౌరభాలకు ఆద్యంపోసింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన నిజామాబాద్ ఖిల్లా జైలు నేడు శిథిలావస్థకు చేరుకుంది. పిచ్చిమొక్కలతో వెలవెలబోతోంది. ఈ జైలులోనే కవులు , కళాకారులు, ఉద్యమకారులు శిక్షలు అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నిలయంగామారింది ఖిల్లాజైలు. అంతటి చరత్ర కలిగిన జైలు నేడు శిథిలావస్థకు చేరుకుంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్యులు రగిల్చిన స్పూర్తి పాలకుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతోంది..
Continues below advertisement