వైకల్యాన్ని జయించి సవాళ్లను అధిగమిస్తున్న కామారెడ్డి జిల్లా యువకుడు
విధి వంచించినా...ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు భాను ప్రసాద్. వయస్సు 20 ఏళ్లు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేట ఇతని గ్రామం. తల్లిదండ్రులు రమణా బాయి, సంగారావు. భాను ప్రసాద్ కు ఓ చెల్లి. చిన్న కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పుట్టుకతోనే భాను ప్రసాద్ కు రెండు చేతులు పనిచేయవు. అతని వైకల్యాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. కొడుకు చేతులు బాగు చేసేందుకు తిరగని ఆస్పత్రి లేదు. ఎంతో ఖర్చు చేశారు. ఉన్న ఒక ఎకరం భూమిని కూడా అమ్మేసి వైద్యం కోసం ఖర్చు పెట్టారు. ఫలితం దక్కలేదు. భూమి కోల్పోయి తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా మారారు. కూలీ చేస్తూ...వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.