రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో అప్ గ్రేడ్ పొందిన కరీంనగర్ బాలకేంద్రం
కరీంనగర్ కళలకు కాణాచి గా ప్రసిద్ధి గాంచింది. ఎందరో కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు ఇక్కడి నుండి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అలాంటి కళలైన సంగీతం, నృత్యం, సాహిత్యం గురించి నేర్పించడానికి ఇక్కడ ఒక ప్రభుత్వ సంగీత పాఠశాల మాత్రమే అందుబాటులో ఉంది. అదీ మంథని లో ఉండటంతో దూరం వల్ల కరీంనగర్ కేంద్రంలో ఉన్న బాలలకు కళ లను నేర్పించే అవకాశమే లేదు.