Nirmal TSRTC: పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా.... జాగా కాపాడుకుంటా... మున్సిపల్ అధికారులకు ఆర్టీసీ డిపో మేనేజర్ హెచ్చరిక...
నిర్మల్ పట్టణంలో ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపాలిటీ అధికారుల మధ్య వాగ్వావాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని మున్సిపల్ అధికారులు సిద్ధంకాగా.. వారిని డిపో మేనేజర్ అడ్డుకున్నారు. వారికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఆ స్థలంలో ఆర్టీసీ ఎండీ అనుమతి తీసుకున్నాకే పనులు ప్రారంభించాలని మేనేజర్ చెప్పడంతో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌కు అతనికి మధ్య వాగ్వివాదం జరిగింది.