Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్డుపై బైఠాయించిన మహిళా ఎంపీపీ.. ఆ మంత్రిపై కామెంట్స్

తనను అవమానించారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన తెలిపారు. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎంపీపీ చెప్పారు. మహిళా ఎంపీపీనైనా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఎంపీపీ తడుక రాణి బైఠాయించి నిరసన తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola