ఖమ్మంలో NDRF బృందాలు అవగాహన కార్యక్రమం

Continues below advertisement

ఖమ్మం మున్నేరులో NDRF బృందాల రెస్యూ ఆపరేషన్ మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ ద్వారా ఆ బృందం చేసి చూపించింది. మున్నేరు నీటిలో ఓ మనిషి మునిగితే ఎలా రక్షిస్తారు ? వరదలు, భారీ వర్షాల్లో కొట్టుకుపోతున్న సామాగ్రిని, మునిగిపోతున్న వస్తువులు, మనుషులను కాపాడే విధానన్ని ప్రదర్శించారు. NDRF బృందాల శిక్షణతోపాటు సామాన్య ప్రజలకు NDRF బృందం యొక్క పని తీరు తెలిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం మున్సిపల్ కమిషన్ ఆదర్శ్ సురబీ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు NDRF బృందాల విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram